ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న వైసీపీని ఇంటికి సాగనంపాలని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. ‘ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా కోట్లతో పాటు, కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి ఆకేపోగు ప్రభాకర్ ఇంటింటికి వెళ్లి ఈ మూడున్నర సంవత్సరాలలో వైసీపీ చేసిన ఆరాచక పాలనను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ..... వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయన్నారు. జిల్లా పర్యటనలో చంద్రబాబుకు వచ్చిన ప్రజా ఆదరణను చూసి వైసీపీ నాయకుల్లో వణుకు మొదలైందన్నారు. గర్జనల పేరుతో ప్రజలను మభ్యపెట్టాలని వైసీపీ నాయకులు చూస్తున్నారని ప్రజలు వైసీపీని నమ్మె పరిస్థితి లేదన్నారు.