రాష్ట్రంలో ఉన్న చిన్న, సన్నకారురైతులకు సహకార సంఘాలతోనే మేలు జరుగుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థనరెడ్డి అన్నారు. పల్నాడు జిల్లా, సత్తెనపల్లి మండలంలోని ధూళ్ళిపాళ్ల ఆంధ్రా బ్యాంకు రైతుసేవ సహకార సంఘ 38వ మహాజనసభ ఆదివారం ధూళ్లిపాళ్ల గ్రామంలో జరిగింది. సభకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన మంత్రి మాట్లాడుతూ..... మోసాలకు తావులేకుండా రైతులకు ఈ క్రాఫ్ విధానం తీసుకురావటం జరిగిందని మంత్రిచెప్పారు. దేశ చరిత్రలోనే ఏపీలో 6684కోట్ల రూపాయల రైతు బీమా పంపిణీ చేశామన్నారు. రైతుభరోసా కేంద్రాల ఏర్పాటుతో రైతులకు ఎనలేని మేలు జరుగుతుందన్నారు. కొందరు రైతు భరోసా కేంద్రాలపై దుష్పప్రచారం చేస్తున్నాయన్నారు.