కొద్దికాలంగా చైనాలో కరోనా మళ్లీ వ్యాపిస్తుందన్న ఆందోళనలతో ప్రపంచ దేశాల్లో కలవరం మెుదలైంది. ఈ క్రమంలో చైనాలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. శనివారం 10,815 మందికి వైరస్ సోకగా, నిన్న 8,838 మందికి పాజిటివ్ వచ్చింది. ఇందులో 2240 మందికి లక్షణాలు ఉండగా, 6598 మందిలో ఎలాంటి లక్షణాలు లేవని నేషనల్ హెల్త్ కమిషన్ సోమవారం వెల్లడించింది. వైరస్ వల్ల కొత్తగా ఎవరూ చనిపోలేదని తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు 3,65,312 కరోనా కేసులు నమోదయ్యాయని చెప్పింది. కొత్తగా నమోదైన కేసుల్లో రాజధాని బీజింగ్‌లో 1130 పాజిటివ్ కేసులు ఉన్నాయని అధికారులు తెలిపారు.