ఏ గ్రామం వెళ్లినా పేదలు, రైతులు ఇదేం ఖర్మ అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, వైసీపీ పాలనపై ప్రజలు విసిగి పోయారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ అన్నారు. పాలకొల్లు మండలంలోని తిల్లపూడిలో జరిగిన ఇదేం ఖర్మ రాష్ట్రానికి కార్యక్రమంలో వారు మాట్లాడారు. గ్రామంలో ఇంటింటికి తిరిగి సమస్యలు అడిగి తెలుసు కున్నారు. కొన్ని ప్రాంతాల్లో రేషన్, పింఛన్లు తొలగిస్తున్నారని, దీనిని సరిచేసే అవకాశం లేదని ఎమ్మెల్యే నిమ్మల, ఎమ్మెల్సీ అంగర అన్నారు. రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎన్నో ఇబ్బందులు పడు తున్నారని చదువుకున్నవారికే అర్ధం కాని నిబంధనలు సామాన్య రైతులకు ఏవిధంగా అర్ధం అవుతాయని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో కోడి విజ యభాస్కర్, పాముల రజని, బోడపాటి కాశి, ఎన్.రామాంజనేయులు, ఎస్.స త్యనారాయణ, ఎస్.నారాయణమూర్తి, బి.రంగారావు, డి.రామాంజనేయులు, గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.