ప్రధాని మోడీని చంపేందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన మధ్యప్రదేశ్ కాంగ్రెస్ లీడర్, మాజీ మంత్రి రాజా పటేరియాను ఇవాళ పోలీసులు అరెస్ట్ చేశారు. పన్నా జిల్లా పొవైలో కార్యకర్తల సమావేశంలో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘ప్రధాని మోడీ.. మతం, కులం, భాష ప్రాతిపదికన ప్రజలను విభజిస్తున్నారు. దళితులు, గిరిజనులు, మైనారిటీల జీవితాలు ప్రమాదంలో ఉన్నాయి. రాజ్యాంగాన్ని కాపాడాలంటే మోడీని చంపేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపాయి.