జమ్మూకాశ్మీర్ లోని సోపోర్ లో కేంద్ర భద్రతా బలగాలు మంగళవారం ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరాన్ని గుర్తించాయి. లాకాలేజ్ సమీపంలో ఇవి లభించడంతో ఆ రదాదారిని మూసేశారు. సమాచారం అందుకున్న యాంటీ బాంబ్ స్క్వాడ్ వీటిని నిర్వీర్యం చేసింది. దక్షిణ కశ్మీరులోని షోపియాన్ లోని షిర్మల్ ప్రాంతంలో పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారి తెలిపారు. రోడ్డుపై పేలుడు పదార్థాలు ఉంచడం ఉగ్రదాడిలో భాగమేనని వెల్లడించారు. కాగా, గత నెలలో ఉత్తర కాశ్మీర్ లోని బందిపూర్ జిల్లాలో పేలుడు పదార్ధాలు కనుగొన్నారు.