ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహిళని వేధించిన కేసులో ముగ్గురికి జైలు శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 13, 2022, 01:30 PM

మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో ముగ్గురికి 18 నెలల జైలు శిక్ష విధించారు. వివరాల్లోకి వెళ్ళితే.....విజయనగరం జిల్లా పరిధిలోని రంగప్పవలస గ్రామానికి చెందిన దమరసింగి శంకరరావు, దమరసింగి రామకృష్ణ, దమరసింగి అప్పన్న అదే గ్రామం లోని ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించడంపై 2017 ఏప్రిల్‌ నెలలో కేసు నమో దయ్యింది. సదరు మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈనేపథ్యంలో సోమవారం బొబ్బిలి పీజేసీటీ కోర్టు వారికి 18 నెలల జైలుశిక్ష, ఒక్కొక్కరికి రూ.3 వేల జరిమానా విధించినట్టు ఎస్‌ఐ రమేష్‌ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com