ఆశా వర్కర్లను రెగ్యులర్ చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల సంఘం నాలుగో రాష్ట్ర మహాసభ సందర్భంగా విజయనగరంలో సోమవారం భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో లక్ష్మణరావు మాట్లాడుతూ.. ఏడో వేతన సంఘ సిఫారసుల మేరకు ఆశాలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.