తుఫాను బాధిత రైతులు ఎవరు అధైర్య పడకండి, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానంటూ గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తంబాలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం మొలకల చెరువు మండలంలోని దేవలచెరువులో ఎమ్మెల్యే గడపగడపకు పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎక్కువమంది మాండు తుఫాను కారణంగా నష్టపోయామని ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు తీసుకురావడంతో స్పందించిన ఎమ్మెల్యే రైతులు ఎవరు అధైర్య పడవద్దు, ప్రభుత్వం నుంచి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటానని ఎమ్మెల్యే రైతులకు హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన ప్రతి కుటుంబానికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందేలా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ సాయి లీల ఉమా మహేష్, సర్పంచులు రాంబాబు, మండల స్థాయి నాయకులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.