ప్రజలందరూ వైద్య సేవలు మరింత అందుబాటులోకి రావాలన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు చొరవతో మాడుగుల మోదమాంబ కాలనీలో వైయస్సార్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేస్తున్నట్లు ఎంపీపీ వి రామ ధర్మ జ చెప్పారు. బుధవారం కాలనీలో 20 లక్షల రూపాయలతో నిర్మించిన హెల్త్ క్లీన్ కు భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే మాడుగుల ప్రభుత్వాసుపత్రి ఆధునికరణ చేయడంతో పాటు కొత్త భవనాలు కూడా నిర్మించడం జరుగుతుందని, ఫోటో స్థాయిలో డాక్టర్లను సిబ్బందిని నియమించడంతోపాటు కావలసిన అన్ని రకాల మందులు అందుబాటులో కి వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలో హెల్త్ క్లినిక్ ల ద్వారా కూడా వైద్య సేవలు మరింత అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఎడ్ల కళావతి, ఉప సర్పంచ్ ఎస్ శ్రీనివాసరావు, ఎంపీటీసీ కే మహేశ్వరి, షేక్ ఉనిస, సహకార సంఘం అధ్యక్షుడు పి వెంకటరావు, వార్డు సభ్యులు జై వరహాలు ఎస్ వాసు, వైసిపి నాయకులు బి శ్రీనివాసరావు, కే మోదకొండ, ఎన్ నాగ శంకర్, కాలనీ ప్రతినిధులు ఎం వి రమణ, జి జగన్నాథరావు, తదితరులు పాల్గొన్నారు