నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలున్నాయి. వాటిని లడ్డు లేదా మరే ఆహారంలోనైనా చేర్చుకోవచ్చు. నువ్వులను తినడం ద్వారా ఎముకలను ధృడంగా మార్చుకోవచ్చు. అవిసె గింజల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. రోజూ 1-2 స్పూన్ల అవిసె గింజలను తినాలి. పొద్దుతిరుగుడు విత్తనాలు, చియా గింజలు, గసగసాలు తీసుకుంటే కాల్షియం లోపాన్ని అధిగమించవచ్చు. ఫలితంగా ఎముకలను ధృడంగా చేసుకోవచ్చు.