గుంతకల్లు పట్టణంలోని 32 వ వార్డు ఏకలవ్య నగర్ కాలనీలో గిరి జనుల ఆరాధ్య దైవం ఏకలవ్యుడు పేరుతో ఎమ్మెల్యే వై. వెంకటరామిరెడ్డి ఆర్థిక సహకారంతో నిర్మించనున్న ముఖ ద్వారం నిర్మాణానికి బుధవారం మున్సిపల్ వైస్ చైర్ పర్సన్లు మైమున్, నైరుతి రెడ్డిలు భూమి పూజ చేశారు. ఈ కార్యక్ర మంలో మున్సిపల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు విశ్వనాథ్, కౌన్సిలర్లు వై. సుధాకర్, నగేష్, విద్యారాణి, మహా లక్ష్మి, కాలనీ పెద్దలు వెంకటేష్, నాగేంద్ర రామాంజి నేయులు, రమేష్, ఆంజి, దాసప్ప, కిష్టప్ప, భగవంతప్ప, మాధవ ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa