ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహాయం చేయడం ద్వారా అందరి మన్ననలను పొందిన యాక్టర్ సోనూ సూద్ కు తాజాగా పోలీసులు ఓ సూచన చేశారు. ఇదిలావుంటే సోనూ సూద్ కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కదులుతున్న ట్రైన్ లో డోర్ వద్ద కూర్చున్న వీడియో అది. ఈ వీడియోపై కొందరు నెటిజెన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇలాంటి వీడియోలు ప్రమోట్ చేయడం సరికాదని చెపుతున్నారు. ఎంతో మందికి స్పూర్తిదాతగా ఉన్న మీరు ఇలా చేయవద్దని కోరుతున్నారు. మరికొందరు సోనుపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ముంబై రైల్వే పోలీసులు కూడా స్పందించారు. 'సోనూ సూద్ ఫుట్ బోర్డ్ మీద ప్రయాణించడం సినిమాల్లో అయితే ఎంటర్టైన్ మెంట్ గా ఉంటుంది. నిజ జీవితంలో కాదు' అని వ్యాఖ్యానించారు.