ఆటోలో ప్రయాణిస్తున్న ఓ నర్సింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన పంజాబ్ లో జరిగింది. మోహాలి జిల్లాకు చెందిన మన్మోహన్ సింగ్ మణి(29), మల్కీత్ సింగ్ బంటీ(24) అనే ఇద్దరు యువకులు ఆటో డ్రైవర్, క్లీనర్ గా పని చేస్తున్నారు. బుధవారం రాత్రి బాధితురాలు వీరి ఆటో ఎక్కగా నిందితులు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. రైత్ బహ్రా వర్శిటీ సమీపంలో వారి నుంచి బాధితురాలు అతి కష్టం మీద తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారించిన పోలీసులు కొన్ని గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేశారు.