కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత జోడో యాత్ర శుక్రవారానికి 100 రోజులు పూర్తి చేసుకోనుంది. భారత్ దక్షిణ కొన నుంచి ఒక్క అడుగుతో మొదలైన యాత్ర వడవడిగా కొనసాగుతోంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ సాగే 3,500 కి.మీ పొడవునా సాగే ఈ యాత్రలో రాహుల్ కు మద్దతుగా అన్ని వర్గాల నుంచి అనూహ్య స్పందన వస్తోంది. అయితే ఈ ప్రజాదరణ 2024 లోక్ సభ ఎన్నికల్లో ఓటుబ్యాంక్ పెంచుతుందో లేదోనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.