విజయవాడ, ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ రెండోరోజు కొనసాగుతోంది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం భక్తులతో పోటెత్తింది. దుర్గమ్మ నామస్మరణతో క్యూ లైన్లు మార్మోగుతున్నాయి. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు నాలుగు క్యూ లైన్లలో నిండుగా భవానీలు ఉన్నారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. బస్ స్టేషన్, రైల్వే స్టేషన్ దగ్గర కూడా ప్రచారం కౌంటర్లు ఏర్పాటు చేశారు.