వైసిపి అనేక వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి వాటిని నెరవేర్చకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే విజయ్ కుమార్ శనివారంనాడు పత్రిక ప్రకటన ద్వారా విమర్శించారు. మద్యపాన నిషేధమని వాగ్దానం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకో లేదని పైగా పనికిరాని బ్రాండ్లు తయారు చేసి అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు లేవు అని విజయ్ కుమార్ ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వం లో దాడులు హత్యలు అత్యాచారాలు పెరిగిపోయాయి అని ఆయన ఆరోపించారు.