గుంతకల్లు పట్టణంలోని 31వ వార్డు మస్తాన్ పేట, ఆలూరు రోడ్డు ప్రాంతా లలో కార్మికులు చేస్తున్న పారిశుద్ధ్య పనులను మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పరిశీలించారు. మురికి కాలువలలో పూడికతీత పనులు సక్రమంగా నిర్వహింప చేయాలని సచివాలయ శానిటేషన్ కార్యదర్శి లను ఆదేశించారు. ఆలూరు రోడ్డు. లో గాయత్రి ఫంక్షన్ హాలు నుండి షికారి కాలనీ వరకు రోడ్డుకు ఇరు వైపులా ఉన్న చెత్తను ట్రాక్టర్ ద్వారా తొలగించి మరలా చెత్తకుప్పలు లేకుండా చర్యలు తీసుకోవాలని అసిస్టెంట్ కమిషనర్ ను, శానిటరి ఇన్స్పెక్టర్ ను ఆదేశించారు.