ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్ష సమావేశానికి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గడప గడపకు మన ప్రభుత్వంపై అలక్ష్యం వద్దు అని సీఎం వైయస్ జగన్ సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మార్చి నాటికి పూర్తిచేయాలని ఆదేశించారు. కొందరు ఎమ్మెల్యేలు తక్కువ రోజులు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారని, మార్చి నాటికి పూర్తిస్థాయి నివేదికలు తెప్పిస్తామని, తక్కువ రోజులు చేసిన వారు వారి పనితీరును మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు.