పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలుపై స్పందించిన మంత్రి అంబటి రాంబాబు. కాపుల గుండెల్లో కుంపటి నేను కాదు..పవన్ కళ్యాణ్ అని అంబటి స్పష్టం చేశారు. కాపులను చంద్రబాబుకు తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు... ఏనాడైనా పోలవరంపై చంద్రబాబును ప్రశ్నించావా? అంటూ మండిపడ్డారు. కాపుల పాలిట శని పవన్ కల్యాణ్ అని విమర్శించారు. తనపై పవన్ చేస్తున్న ఆరోపణలు నిజమని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అంబటి సవాల్ విసిరారు. పవన్ తన వాహనానికి వారాహి పేరు మార్చుకోకపోతే పవన్ భ్రష్టుపట్టిపోతాడని హెచ్చరించారు. వారాహి అనేది దేవత పేరు... పవన్ తన వాహనానికి వరాహం అని పేరు పెట్టాలి అని స్పష్టం చేశారు.