రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ ఫ్యాక్షన పాలనకు రోజులు దగ్గర పడ్డాయని టీడీపీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, పాణ్యం నియోజకవర్గ ఇనచార్జ్, మాజీ ఎమ్మెల్యే గౌరుచరిత ఆరోపించారు. నగరంలోని తన స్వగృహంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ.... మాచర్లలో ఇదేమి ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం నిర్వహిస్తున్న జూలకంటి బ్రహ్మారెడ్డి తదితరుల మీద, పార్టీ కార్యాలయం మీద వైసీపీ రౌడీమూకలు దాడి చేయడం దారుణమని అన్నారు. టీడీపీని చూస్తే సీఎంకు భయం కలుగుతోందని అన్నారు. తనప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే జగన్ జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు.