ఏపీలోని విజయవాడలో దారుణం జరిగింది. ఓ మహిళను మూడు రోజులపాటు గదిలో బంధించి నలుగురు వ్యక్తులు అత్యాచారం చేశారు. ఈ నెల 17న ఓ గదిలో మహిళను నిర్బంధించారు. మహిళకు మద్యం తాగించి, సిగరెట్లతో కాల్చారు. ప్రస్తుతం బాధితురాలు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa