నాతవరం మండలం చమ్మచింత, నాతవరం గ్రామానికి చెందిన ఇద్దరికీ సీఎం సహాయ నిధి కింద నిధులు మంజూరయ్యాయి. కంకిపాడు వరలక్ష్మికి లక్ష రూపాయలు, గుడివాడ పోర్వాజ్ కు 40 వేల రూపాయలు చెక్కులను నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ సోమవారం నర్సీపట్నం తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. దరఖాస్తులు అందిన వెంటనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సీఎం సహాయ నిధి నుంచి నిధులు మంజూరు చేశారని అన్నారు. స్థానిక వైసిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.