పలాస క్రీడా మైదానంలో డిసెంబర్ 22న ఉదయం 7గంటలకు జిల్లా స్థాయి క్రీడా పోటీలు జరగనున్నాయి. క్రీడా ప్రోత్సాహకులు తమలంపూడి సురేష్ రెడ్డి జ్ఞాపకార్ధం పలాస మైదాన క్రీడాబృందం ఈ పోటీలను నిర్వహిస్తుందని రాష్ట్ర పీఈటీ సంఘ సంయుక్త కార్యదర్శి పి తవిటయ్య మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. విజేతలకు జ్ఞాపికలను అంతర్జాతీయ క్రీడాకారుడు బమ్మిడి వెంకటేష్ అందిస్తున్నారని చెప్పారు. పాఠశాల (బాలబాలికలు) మరియు ఓపెన్ కేటగిరీలో ఈ పోటీలు జరుగుతాయని పలాస జడ్పీహెచ్ స్కూల్ పి. డి తవిటయ్య తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa