ఏటికేడు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీటిని సరఫరా చేయడం చాలా కష్టం. మురుగునీటి శుద్ధి, క్లౌడ్ సీడింగ్, డీసాలినేషన్ పద్ధతులు కొంత వరకే పని చేస్తాయి. అయితే, ఈ సమస్యకు పరిష్కారం చూపారు శాస్త్రవేత్తలు. అమెరికాలోని ప్రెయిరీ రీసెర్జ్ ఇనిస్టిట్యూట్ పరిశోధకులు సముద్ర జలాలపై ఉండే నీటి ఆవిరిని ఒడిసిపట్టే కొత్త విధానాన్ని కనుగొన్నారు. ఆ ఆవిరి స్వచ్ఛమైన నీరని.. దీంతో కరువు ప్రాంతాల్లో చాలా వరకు తాగునీటి సమస్యకు చెక్ పెట్టవచ్చని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa