పుదుచ్చేరిలోని సేలిఅమేడు ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ప్రతిభను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. సేలిఅమేడు ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థులు వ్యర్థ పదార్థాలతో అవతార్ బొమ్మలను తయారు చేశారు. కొబ్బరి చిప్పలు, మందార ఆకులు, తాటి ఆకులు వంటి సహజ వ్యర్థ పదార్థాలతో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' సినిమా పాత్రల బొమ్మలను రూపొందించారు. ఈ బొమ్మల ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా డిసెంబర్ 16న ఇంగ్లీషు, హిందీ, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో విడుదలైన విషయం తెలిసిందే.