గుంటూరు జిల్లా, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమ పేరుతో వంచించిన సీనియర్ విద్యార్థి వేధింపులు తట్టుకోలేక డిగ్రీ విద్యార్థిని శుక్రవారం ఆత్మహత్య చేసుకుంది. పల్నాడు జిల్లాకు చెందిన ఈ విద్యార్థిని, తనను శారీరకంగా లొంగదీసుకుని, రహస్యంగా వీడియోలు తీసి, వాటిని పలువురు విద్యార్థులకు పంపించిన సీనియర్ విద్యార్థి బెదిరింపులకు గురైంది. కోరిక తీర్చకపోతే వీడియోలు ఫేస్‌బుక్‌లో పెడతానని బ్లాక్‌మెయిల్ చేయడంతో మనస్తాపంతో విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa