విజయనగరం జిల్లామెంటాడ ప్రభుత్వం చే పడుతున్న ప్రభుత్వం ప్రధకాలు సక్రమంగా లజ్జదారులకు అందుతున్నది లేనిది తెలుసుకోవడం కొరకు గ్రామాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని జరుగుతుందని మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు రెడ్డి సన్యాసినాయుడు తెలిపారు. మండలంలోని మీసాల పేట గ్రామంలో గల సచివాలయంలో సచివాల సిబ్బందితో గ్రామస్తులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సన్యాసినాయుడు, ప్రభుత్వం అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్లు చూడాలని ఆ దిశగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. సచివాలయ సిబ్బంది వాలంటీర్లు విధులకు సక్రమంగా వస్తున్నది లేనిది అడిగి తెలుసుకున్నారు.షబ్బీ ప్రజలకు అందుబాటులో ఉండి పధకం కచ్చితంగా అందేటట్లు కృషి చేయాలని తెలిపారు. గ్రామస్తులను ఎలాంటి ఫిర్యాదులు రాకుండా తగు చర్యలు గై కొనాలని కార్యాల సెక్రటరీకి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ సార్ కి ఈశ్వరరావు, గ్రామ సర్పంచ్ రామనాయుడు, చింతలవలస సర్పంచ్ కలిశెట్టి సూర్యనారాయణ, గ్రామ కార్యదర్శి లక్ష్మణ్ సచివాల సిబ్బంది గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.