బీహార్ లోని అధికార పార్టీ జేడీయూ నేత పేరుపై గల ఇంట్లో భారీగా మద్యం పట్టుబడింది. మధురానగర్ లోని ఛప్రాలో జేడీయూ నేత కామేశ్వర్ సింగ్ కు చెందిన ఇంట్లో పోలీసులు భారీగా మద్యం పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఇంట్లో సరోజ్ మెహతో, అతని భార్య అద్దెకు ఉంటున్నారని పోలీసులు తెలిపారు. మహిళను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీనిపై కామేశ్వర్ సింగ్ స్పందిస్తూ తనకు ఈ విషయం మీడియా ద్వారానే తెలిసిందని, ఆ ఇంటిని తాము 32 ఏళ్ల కిందటే వదిలేసామని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని, తమ ప్రభుత్వంపై బురద చల్లడానికే ఎవరో కావాలని మద్యం సీసాలను అక్కడ పెట్టారని అన్నారు.