ఇవాళ నా పుట్టిన రోజు గురించి మాట్లాడటం లేదు..పుట్టిన బిడ్డ గురించి ఆలోచన చేస్తున్నానని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో డిటిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.సమాజంలో ఉన్న అంతరాలు తొలగాలని, పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తుంటే కోర్టులకు వెళుతున్నారని చెప్పారు. పెత్తందారీ భావజాలం చూస్తుంటే బాధనిపిస్తుందని చెప్పారు. బాపట్ల జిల్లా యడ్లపల్లి జెడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం వైయస్ జగన్ 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మాట్లాడారు.