నంద్యాల జిల్లా కనాల గ్రామం సమీపంలో శబరిమల వెళ్తున్న అయ్యప్ప స్వాముల మిని బస్సు టెంపో ట్రావెల్లర్ బోల్తా పడిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బస్సులో 15 మంది ప్రయాణిస్తుండగా 7 గురికి గాయాలు కాగ వైద్య చికిత్స నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన కర్నూల్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa