పదో తరగతి పరీక్షల ఫీజు గడువును ఈనెల 24 వరకు పొడిగించినట్లు శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారి మీనాక్షి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో అన్ని యాజమాన్య పాఠశా ప్రధానోపాధ్యాయులు 2023 మార్చి-ఏప్రిల్లో నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల రెగ్యులర్ విద్యార్థులతోపాటు పరీక్ష తప్పిన విద్యార్థులు సైతం పరీక్షా ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రూ. 50 అపరాధ రుసుముతో ఈనెల 29 వరకు, రూ. 200 పెనాల్టీతో జనవరి 3 వరకు, రూ. 500 అపరాధ రుసుముతో జనవరి 9 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని, ఆన్లైన్ అప్లికేషన్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తులను అప్లోడ్ చేయాలని సూచించారు.