శ్రీసత్య సాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలోని సానిపల్లి ఎం పి యూ పి పాఠశాల నందు విద్యార్థుల కు టాబ్స్ పంపిణీ చేశారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 8 వ తరగతి విద్యార్థుల కు ట్యాబ్లు పంపిణి కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చంద్రశేఖర గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గ్రామ సర్పంచ్ పరమేష్, ఎస్. ఎం. సి ఛైర్పర్సన్ శ్రీనివాసులు, ఎంపీటీసీ శంకర్ రెడ్డి, గ్రామస్తులు కిష్టప్ప, జయచంద్ర, నాగేంద్ర పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పోతలయ్య, నారాయణ స్వామి, కృష్ణా నాయక్, సత్యమయ్య, మోహన్ రెడ్డి, లక్ష్మీనారాయణ, జయమ్మ, నరేష్ కుమార్, వరలక్ష్మి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa