ఆంధ్రప్రదేశ్ లోని అనకాపల్లి జిల్లాలో సోమవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. పరవాడ ఫార్మాసిటీలో మంటలు చెలరేగాయి. లారస్ యూనిట్ 3లో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.