కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. రాష్ట్రంలో కోవిడ్ సంసిద్ధత, కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి ప్రాజెక్టుల ఆమోదంపై చర్చించినట్లు సీఎంఓ తెలిపింది. అంతే కాకుండా కేంద్ర-రాష్ట్ర సంబంధాల పటిష్టత, జాతీయ రహదారుల అభివృద్ధి వంటి ప్రాజెక్టుల పనులు వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం విజయన్ మోదీకి కథాకళి శిల్పాన్ని బహుమతిగా ఇచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa