వైసీపీని మళ్లీ అధికారంలోకి రానివ్వనని పవన్ అంటున్నారని... అంత మగాడా ఆయన అని ఏపీ రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ను నమ్ముకున్న తన వెంట ఉంటారో లేక చంద్రబాబుకి ఊడిగం చేస్తున్న పవన్ కల్యాణ్ వెంట ఉంటారో కాపులు తేల్చుకోవాలని ఏపీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఒక్క చోట కూడా గెలవలేని పవన్ కల్యాణ్ తన గురించి మాట్లాడతారా? అని మండిపడ్డారు.
విపక్షాలను తాను విమర్శించినంత ఘాటుగా ఎవరూ విమర్శించరని... అందుకే పవన్ తనను టార్గెట్ చేశారని దుయ్యబట్టారు. కాపు సామాజికవర్గాన్ని చంద్రబాబు దొడ్లో కట్టేసేందుకు పవన్ యత్నిస్తున్నారని అన్నారు. తాను ఒక్క పైసా అవినీతికి పాల్పడకపోయినా... తనపై విమర్శలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు.