కర్లపాలెం మండలంలో జగనన్న కాలనీలలో గృహ నిర్మాణాలు వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని గృహ నిర్మాణ శాఖ డిఈ శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, వీఆర్వోలు, పంచాయతీ కార్యదర్శులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. స్థలం పొందిన లబ్ధిదారులకు అవగాహన కల్పించి గృహాలు నిర్మించేలా చూడాలన్నారు. వారికి త్వరితగతిన రుణాలు కల్పించాలన్నారు.