మాచర్ల పట్టణంలోని రింగ్ రోడ్ సెంటర్ నందు నూతనంగా బృందావన్ ఫ్యామిలీ ఫుడ్ కోర్ట్ ను మాచర్ల శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. సామాన్యుడికి సైతం అందుబాటు ధరలలో స్వచ్ఛత, నాణ్యత కలిగిన ఫుడ్ ను అందించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినది. ఈ బృందావన్ ఫ్యామిలీ ఫుడ్ కోర్ట్ మాచర్ల పట్టణంలో మునుపెన్నడూ లేని రీతిలో అన్ని రకాల వెరైటీలను ఒకచోటకు చేర్చి చూపుతున్నదే ఈ ఫుడ్ కోర్ట్. పేదవాడి టి దగ్గర నుంచి మధ్యతరగతి వాడి బిరియాని వరకు అన్ని రకాల రుచికరమైన వెరైటీలను సరసమైన ధరలకు మాచర్ల మరియు పరిసర గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ఏర్పాటు చేయబడినదే ఈ మీమా బృందావన్ ఫ్యామిలీ ఫుడ్ కోర్ట్. ఈ కార్యక్రమంలో మాచర్ల మున్సిపల్ చైర్మన్ బోయ రఘురామిరెడ్డి , శ్రీనివాస శర్మ , పాపారావు, కళ్యాణి , వైసీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.