చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోటలో గల దత్త సాయి పీఠాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని సందర్శించారు. బుధవారం ఆమె పర్యటనలో భాగంగా స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ చైర్మన్ పూసపాటి బాలాజీ ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆలయ అర్చకులు స్వామివారిపట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.