మెంతి కూరలో ఉండే పోషకాలు అధిక రక్తపోటును, గుండె సంబంధిత సమస్యలను అదుపులో ఉంచుతాయి. అధిక కొలెస్ట్రాల్ సమస్యకు మెంతికూర చెక్ పెడుతుంది. మెంతిలో విటమిన్ సి, ఎ, బీటా కెరొటిన్ వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. బరువు తగ్గించడంలో మెంతికూర సహాయపడుతుంది. కొన్ని రోజులు మెంతికూర తీసుకుంటే నెలసరి సమస్య పోతుందని నిపుణులు చెబుతున్నారు. మెంతికూరలో క్యాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి.