మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో దారుణం వెలుగుచూసింది. హబీబ్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదో తరగతి బాలికకు ట్యూషన్ చెప్పడానికి ప్రయాగ్ విశ్వకర్మ ఇంటికి వస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం అతను అడిగిన పదానికి స్పెల్లింగ్ బాలిక సరిగా చెప్పలేదు. దీంతో కోపం పెంచుకున్న అతను బాలికను గట్టిగా కొట్టాడు. ఈ క్రమంలో బాలిక చేయి విరిగింది. నొప్పితో చిన్నారి కేకలు వేయగా బాలిక మేనమామ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ప్రయాగ్ ను అరెస్ట్ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa