చెన్నూరు మండలం కొండపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ విద్య అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ట్యాబులు పాఠశాలలోని 8వ తరగతి చదువుతున్న 32 మంది విద్యార్థులు, విద్యను బోధిస్తున్న 6 మంది ఉపాధ్యాయులకు ట్యాబులు అందాయి. గురువారం పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఉమామహేశ్వరి విద్యార్థులకు , ఉపాధ్యాయులకు ట్యాబులు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు డిజిటల్ విద్యను అందించేందుకు ఉపాధ్యాయులకు శిక్షణ అనంతరం విద్యార్థులకు డిజిటల్ విద్యను బోధించడం జరుగుతుందని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పి. విజయ కుమారి, శ్రీనివాస్ కుమార్, ఇందిరామణి, ఎన్. రాజేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa