ప్రధాని మోదీ తల్లి హీరాబెన్ మోదీ(100) మృతిచెందారు. ఇటీవలే అస్వస్థతకు గురైన ఆమె చికిత్స పొందుతూ కన్నుమూసారు. హీరాబెన్ 1922లో గుజరాత్ లోని మెహ్ సనాలో జన్మించారు. 1935లో దామోదర్ దాస్ ముల్ చంద్ మోదీని వివాహం చేసుకున్నారు. ఆమెకు ఐదుగులు కుమారులు, ఒక కుమార్తె సంతానం. నరేంద్ర మోదీ, సోమా మోదీ, పంకజ్ మోదీ, అమృత్ మోదీ, ప్రహ్లాద్ మోదీతో పాటు కుమార్తె వసంతీబెన్ ఉన్నారు. ప్రధాని మోదీ హీరాబెన్ కు మూడో సంతానం. హీరాబెన్ తన కొడుకు ఎదుగుదలను చూసి సంతోషపడుతూ ఉండేవారు. కాగా, భర్త మరణం తర్వాత నుండి హీరాబెన్ పంకజ్ మోదీ నివాసంలోనే ఉంటున్నారు.