ప్రధాని నరేంద్రమోదీ తల్లి హీరాబెన్ ఇవాళ కన్నుమూసిన విషయం తెలిసిందే. తల్లి చనిపోయిన దుఃఖంలో కూరుకుపోయిన మోదీ, తన విధులను మాత్రం మరవలేదు. బాధను దిగమింగుకుని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లో వందే భారత్ ఎక్స్ప్రెస్ను వర్చువల్గా ప్రారంభించారు. ఇక కోల్కతాలో జరిగే జాతీయ గంగా మండలి సమావేశానికి కూడా మోదీ వర్చువల్గా అధ్యక్షత వహించనున్నారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన అనంతరం ప్రధాని వ్యక్తిగత కారణాల వల్ల అక్కడికి రాలేకపోయినందుకు బెంగాల్ ప్రజలకు క్షమాపణలు తెలిపారు.