జనవరి 1న జరుపుకునే వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని పుట్టపర్తి పట్టణ సిఐ బాలసుబ్రహ్మణ్యం రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ జనవరి 1న జరుపుకునే వేడుకలలో ఇస్తారాజ్యంగా యువత బైకులలో హోరున శబ్దం చేస్తూ హంగామా చేయరాదన్నారు. పుట్టపర్తి పవిత్రతను దృష్టిలో ఉంచుకొని ఎలాంటి హంగామా చేయరాదన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. హోటల్లు, ఇతర ప్రాంతాలలో హోరెత్తించే మ్యూజిక్ లు పెట్టరాదు అన్నారు. ఎలాంటి హంగామాలు చేయకుండా ప్రశాంత వాతావరణంలో పండుగలు నిర్వహించుకోవాలని చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.