యూపీలోని బస్తీ జిల్లాలోని తలుపులు, గోడలు లేకుండానే నాలుగు మరుగుదొడ్లను ఒకదాని పక్కన ఒకటి నిర్మించారు. ధన్సా గ్రామంలో ఇటీవల నిర్మించిన ఈ పబ్లిక్ టాయిలెట్ల ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. అలా ఎలా నిర్మిస్తారంటూ తెగ ట్రోల్ చేశారు. దీంతో స్పందించిన పంచాయతీ రాజ్ అధికారులు వాటిని పగలగొట్టి ధ్వంసం చేశారు. ఈ మరుగుదొడ్ల విషయంలో నిబంధనలు పాటించలేదని, దర్యాప్తు నివేదిక అందాక తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.