ప్రకాశం జిల్లా కొండేపి మండలం పెట్లూరులో శనివారం టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. కందుకూరులో చంద్రబాబు పర్యటన సందర్భంగా జరిగిన ఘటన నేపథ్యంలో ప్రకాశం జిల్లా పోలీసులు ముందస్తుగా అలర్ట్ అయ్యారు. దర్శి డిఎస్పి నారాయణస్వామి రెడ్డి పెట్లూరును సందర్శించి, స్థానిక పోలీసు అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.