ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘోసిలో దారుణం జరిగింది. చెత్త పడేయడానికి ఇంటి నుంచి బయటకి వెళ్లిన బాలిక(14)పై కొందరు దుండగులు అత్యంత పాశవికంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం బాలిక కాళ్లు, చేతులు కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కేసి ఓ గొట్టపు బావిలో పడేశారు. బావిలో పడిఉన్న బాలికను గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు కొందరు కూలీలు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.