ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అవినీతిరహిత పరిపాలన సీఎం జగన్ తోనే సాధ్యం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 01, 2023, 01:00 PM

అవినీతిరహిత పరిపాలన సీఎం జగన్ తోనే సాధ్యమని ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ అన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంలోని తాళ్ళవలస గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్ల పాలనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా అవినీతి రహిత పరిపాలన అందిస్తున్నారని అన్నారు. ముందుగా ఆయనకు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించారు.


ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా లేదా సంక్షేమ పథకాలు అందుతున్నాయా? లేదా? తదితర అంశాలపై ఆరా తీశారు. సంక్షేమ పథకాలపై పేదలు అన్ని వర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ తన సొంత కుటుంబంలా చూసుకుంటున్న ముఖ్యమంత్రి శ్రీ వై. యస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలందరూ రాబోయే ఎన్నికల్లో అండగా ఉండాలని కోరారు. ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకొని పరిష్కరించడం సంతోషకరమని ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com