ఆదివారం జమ్మూ కాశ్మీర్‌లోని రాజౌరీలో ఉగ్రవాదుల దాడిలో ముగ్గురు పౌరులు మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఉగ్రవాదులు ఇంట్లోకి చొరబడి వాళ్లు హిందువులుగా నిర్ధారించుకున్న తర్వాత కాల్పులకు తెగబడినట్లు తెలిసింది. ఇంట్లోకి ప్రవేశించి ఆధార్‌కార్డు ద్వారా వాళ్లు హిందువులను తెలుసుకున్నారని, ఆతర్వాత వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపి ముగ్గురు ప్రాణాలు తీశారని అధికారులు తెలిపారు.